చందంపేట (దేవరకొండ) : తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఒక్క కేసీఆర్ ( KCR ) తోనే సాధ్యమవుతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామా రవీంద్ర కుమార్( Rama Ravindra Kumar ) అన్నారు.
ఆదివారం దేవరకొండ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 4, 17, 16,20 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరకొండ పట్టణంలో అభివృద్ధి జరిగిందంటే కేసీఆర్ హయంలోనే జరిగిందని గుర్తు చేశారు. అందుకే మరోసారి కేసీఆర్ను కోరుకుంటున్నారని అన్నారు.
పట్టణ ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ నేటి వరకు అమలు కాలేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణంలో రూ. 30 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇన్చార్జ్ పాల్వాయి స్రవంతి, కేతావత్ బిల్యా నాయక్, రమేశ్ నాయక్, కిషన్ నాయక్, మంజ నాయక్, రవికుమార్, రూపా నాయక్, శ్రీధర్, పొట్ట మధు, జాఫర్, నిర్మలా పాల్గొన్నారు.