Arjun Mahi | ఇష్టంగా సినిమాతో హీరోగా డెబ్యూ ఇచ్చాడు అర్జున్ మహి. ఆ తర్వాత ఎంజాయ్, నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్ సినిమాలు చేశాడు. తాజాగా బరాబర్ ప్రేమిస్తా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చి తన యాక్టింగ్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు అర్జున్ మహి. చంద్రహాస్ హీరోగా వచ్చిన బరాబర్ ప్రేమిస్తా చిత్రంలో హీరోయిన్ సోదరుడి పాత్రలో నటించాడు.
చంద్రహాస్, అర్జున్ మహి మధ్య వచ్చే సన్నివేశాలు.. ప్రత్యేకించి యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అర్జున్ మహి యాక్టింగ్‌కు ఓ వైపు ప్రేక్షకులు, మరోవైపు క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అర్జున్ మహి తన పాత్ర కోసం 15 కిలోలు కూడా పెరిగాడంటే ఎంత పట్టుదలగా పనిచేశాడో అర్థం చేసుకోవచ్చు.
డెడికేటెడ్ యాక్టర్‌గా తనను తాను నిరూపించుకునే పనిలో ఉన్న అర్జున్ మహి ప్రస్తుతం లీడ్ యాక్టర్‌గా రెండు సినిమాలు ఓకే చేయగా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నాయి. మొత్తానికి ఓ వైపు హీరోగా చేస్తూనే.. మరోవైపు పవర్ ఫుల్ కథలు దొరికితే చేసేందుకు రెడీ అంటూ చెప్పకనే చెబుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు.
The RajaSaab | ముఖం ప్రభాస్ది.. శరీరం ఎవరిది? ‘రాజాసాబ్’ బాడీ డబుల్ సీన్లపై నెటిజన్ల ట్రోలింగ్!
Anil Ravipudi | క్రేజీ రామ్-కామ్.. ‘విత్ లవ్’ మూవీపై అనిల్ రావిపూడి ప్రశంసల జల్లు!
Siva karthikeyan | రేసింగ్ ట్రాక్‌పై కోలీవుడ్ స్టార్స్.. అజిత్‌ని కలిసిన శివకార్తికేయన్