హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత ( Unemployees )తో చెలగాట మాడుతుందని, నోటిఫికేష్ల విషయంలో నిరుద్యోగులపై అభాండాలు మోపుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు ( Harish Rao ) ఆరోపించారు. నిరుద్యోగ యువత తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీని బొందపెట్టుడు ఖాయమని జోస్యం చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు, యువత ఉద్యోగ నోటిఫికేషన్ల( Notifications ) కోసం ధర్నాలు చేస్తుంటే యువతే నోటిఫికేషన్లు వద్దంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నర ఏండ్లుగా యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిందే లేదని విమర్శించారు.
అసెంబ్లీలో కాంగ్రెస్ వచ్చాక ఎన్ని ఉద్యోగాలు నింపారు అని అడిగితే 16 వేలని సీఎం వెల్లడించారని గుర్తు చేశారు. బయట 60 వేల ఉద్యోగాలు ఇచ్చినామని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు ఉన్నాయని డీజీపీ అన్నారు . మరి ఎందుకు ఆ పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తలేరని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో 40వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ కాంగ్రెస్ హయాంలో ఇప్పటి వరకు ఒక్క పోలీస్ నోటిఫికేషన్ కూడా రాలేదని పేర్కొన్నారు.
మెగా డీఎస్సీ అంటూ ఊరించి ఊరించి దగా డీఎస్సీ చేశారని, ఖాళీగా ఉన్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మెగా డీఎస్సీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న రేవంత్ రెడ్డి ఇవ్వాళ హోటళ్లలో పని చేసుకోండని నిరుద్యోగులను అవమానించే విధంగా మాట్లాడుతున్నాడని హరీష్రావు మండిపడ్డారు.