హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగుల పింఛన్ హక్కులను హరిస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దుచేసి.. పాత పింఛన్‌ను పునరుద్ధరించాలని తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్(టీఎస్ సీపీఎస్ఈయూ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు యూనియన్ అధ్యక్షుడు జీ స్థితప్రజ్ఞ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం సీఎస్ సంజయ్ జాజును సచివాలయంలో కలిసి వినతిపత్రాన్ని అందజేసింది.
సీపీఎస్ ఉద్యోగుల సామాజిక భద్రతను దెబ్బతీస్తున్నదని, రిటైర్మెంట్ అనంతరం ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నందున సీపీఎస్‌ను రద్దుచేయాలని స్థితప్రజ్ఞ కోరారు.