సిటీబ్యూరో: పాత వాహనాలే కదా అని ఇష్టమొచ్చినట్టు వాహనాల రంగులు మార్చి రాకపోకలు సాగిస్తున్న వాహనాలపై ఆర్టీఏ అధికారులు దృష్టి సారించారు. చాలా మంది తమ వాహనాలకు మేక్ ఓవర్ షోరూంలకు తీసుకెళ్లి ఇష్టమొచ్చిన విధంగా మార్పులు చేసుకుంటున్నారు.
లైటింగ్ వ్యవస్థ మార్చడం, అధికంగా కాంతి వెదజల్లే బల్బులు వినియోగించడం, ముందు బంపర్ ఎక్స్ట్రాగా అమర్చుకోవడం, మితిమీరిన మ్యూజిక్ సౌండ్, నచ్చిన విధంగా విభిన్న ఆకారాల్లో నంబర్ప్లేట్స్ అమర్చడం, వాహనాల కలర్స్ మార్చడం, వీల్ బేస్కు 69 శాతం అధికంగా బాడీ బిల్డింగ్ ఉండేలా మార్పులు చేస్తున్నారు. అటువంటి వాహనాలపై రవాణా శాఖ కొరడా ఝుళిపిస్తున్నది. తనిఖీల్లో మోటార్ వాహన చట్టం నిబంధనలకు విరుద్ధంగా రాకపోకలు సాగిస్తున్న 17 వాహనాలను అధికారులు సీజ్ చేశారు.