సిటీబ్యూరో, జూలై 6 (నమస్తే తెలంగాణ): గ్రేటర్‌లోని శంషాబాద్, తుర్కయాంజల్, తొర్రూరు, షేక్‌పేట ఘాన్సీబజార్, కార్వాన్ తదితర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. మరో వైపు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. నిన్న మొన్నటి వరకు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోయిన ఉష్ణోగ్రతలు సోమవారం నాడు సాధారణ స్థాయి దాటి నమోదయ్యాయి.
ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33.0 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.2 డిగ్రీలు, గాలిలో తేమ 64 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.