హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. కనీసం 20వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు, పోలీసు ఉద్యోగార్థులు డిమాండ్ చేస్తుండగా కేవలం 5వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తామని ప్రటించింది. రాష్ట్ర పోలీస్ శాఖలో 17వేలకు పైగా ఖాళీలు ఉన్నా కేవలం ఐదు వేల పోస్టులకు మాత్రమే ఆర్థికశాఖ నుంచి అనుమతి వచ్చినట్టు రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శిఖాగోయెల్ శుక్రవారం ఉత్తర్వుల్లో తెలిపారు. పోలీస్‌శాఖ అవసరాలు, ఖాళీల పరిస్థితి, ఆర్థిక భారం తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేరొన్నది.
ఈ నియామకాలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ద్వారా నిర్వహించాలని ఆదేశించింది. అనుమతి పొందిన ఖాళీలకు సంబంధించిన లోకల్ క్యాడర్ వివరాలు, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతల సమాచారాన్ని వెంటనే పోలీస్ నియామక బోర్డుకు సమర్పించాలని హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీలను ప్రభుత్వం ఆదేశించింది. పూర్తి వివరాలు అందిన వెంటనే పోలీసు నియామక ప్రక్రియకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్, షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.
