తిమ్మాజిపేట, జనవరి 16 : నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రానికి చెందిన నరేశ్, కవిత దంపతులకు 2024 డిసెంబర్లో లక్షిత జన్మించింది. నెలలుగడిచినా పాప ఎదుగుదల లేకపోవడంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు దవాఖానలో చూపించగా.. పాపకు న్యూరో ట్రాన్స్‌మీటర్ డిసార్డర్ వ్యాధి ఉందని, వ్యాధి నయం కావాలంటే ఖరీదు రూ.30 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ ఉంటుందని చెప్పడంతో దంపతులు షాక్ తిన్నారు. దీంతో పాపను కాపాడుకునేందుకు కనిపించిన వారిని సాయం కోసం వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. దాతలు ఉంటే సెల్ నంబర్ 9985095509లో సంప్రదించాలని వారు కోరారు.