వాషింగ్టన్: గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకోవడానికి సహకరించని దేశాలపై టారిఫ్‌లు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం హెచ్చరించారు. వైట్ హౌస్‌లో జరిగిన హెల్త్ రౌండ్‌టేబుల్ సందర్భంగా ఈ హెచ్చరిక జారీ చేశారు. దేశ భద్రత కోసం తమకు గ్రీన్లాండ్ అవసరమని చెప్పారు. ఈ ఆర్కిటిక్ దీవిలో అత్యధిక ప్రయోజనాలను రష్యా, చైనా తీసుకుంటున్నాయని, అందువల్ల దీనికి రక్షణ తక్కువగా ఉందని తెలిపారు. ఈ వ్యాఖ్యలను రష్యా ఖండించింది.