మేడ్చల్, నవంబర్ 12 : కేంద్ర ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. యాసంగిలో రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేసే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. అబద్దపు మాటలతో కేంద్రం ప్రజలను మోసం చేస్తున్నదని ఆరోపించారు. రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మేడ్చల్ నియోజకవర్గంలోని మేడ్చల్, ఘట్కేసర్, శామీర్‌పేటలో నిర్వహించిన ధర్నాలో మంత్రి పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏడేండ్లుగా రైతులకు వెన్నుదన్నుగా రాష్ట్ర ప్రభుత్వం నిలబడి వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టిందన్నారు. ఎన్నికలు ఉన్న రాష్ర్టాల్లో వడ్లు కొంటూ, తెలంగాణ రైతులను మాత్రం ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. యాసంగి వడ్లు కొనేదాక ఉద్యమం ఆగదని మంత్రి స్పష్టం చేశారు.
మేడ్చల్ పట్టణంలో…
మేడ్చల్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి స్థానిక వివేకానంద విగ్రహం వద్ద 44వ జాతీయ రహదారిపై నిర్వహించిన ధర్నాలో టీఆర్ఎస్ రాష్ట్ర నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి, జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్ నందారెడ్డి, మేడ్చల్ ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి, జడ్పీటీసీ శైలజారెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ రమేశ్, సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయానందరెడ్డి, నాయకులు , ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రాజీవ్ రహదారి దిగ్బంధం..
శామీర్‌పేట: శామీర్‌పేట మండలం అలియాబాద్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై శామీర్‌పేట, మూడుచింతలపల్లి మండలాలు, తూంకుంట మున్సిపాలిటీ, జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు, రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని నిరసన తెలిపారు. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎండి.జహంగీర్, తూంకుంట చైర్మన్ రాజేశ్వర్‌రావు, వైస్ చైర్మన్ వాణివీరారెడ్డి, డీసీఎంఎస్ వైస్‌చైర్మన్ మధుకర్‌రెడ్డి, ఎంపీపీలు ఎల్లూభాయిబాబు, హారికగౌడ్, జడ్పీటీసీ అనితలాలయ్య, జహీరుద్దీన్, రైతుబంధు సమితి అధ్యక్షులు, కార్యదర్శులు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుదర్శన్, మల్లేశ్‌గౌడ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వరంగల్ హైవేపై నిర్వహించిన ధర్నాకు..
ఘట్కేసర్ : రైతులకు మద్దతుగా ఘట్కేసర్లో టీఆర్ఎస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది. వరంగల్ బైపాస్ వద్ద నిర్వహించిన నిరసనలో మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, టీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్ రెడ్డి, యువనేత డాక్టర్ భద్రారెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీల చైర్మన్లు ఎం.పావనీ జంగయ్య యాదవ్, బి. కొండల్‌రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, బి.శ్రీనివాస్ గౌడ్ ఊరేగింపుగా వెళ్లారు. ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ధర్నాకు హాజరయ్యారు. మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి పాల్గొన్నారు
కీసర నుంచి ఔటర్‌రింగ్ రోడ్డు వరకు..