వనపర్తి, జనవరి 6(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ చేపట్టిన ప్రాజెక్టుల పోరుబాట తొలిరోజు విజయవంతమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేండ్లు అయినా సాగునీటి రంగానికి ప్రాధాన్యమివ్వకపోగా, ఏపీకి సహకరించేలా వ్యవహరించడంపై తెలంగాణ అంతర్గతంగా రగులుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ పనితనాన్ని నిశితంగా గమనించిన బీఆర్ఎస్.. రాష్ట్ర రైతుల ప్ర యోజనాల కోసం నడుం బిగించింది. ఇందులో భాగంగా మంగళవారం ఉమ్మ డి మహబూబ్‌నగర్‌లోని జూరాలతో పాటు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని ఎల్లూరు రిజర్వాయర్‌ను బీఆర్ఎస్ బృందం సందర్శించింది. ముందుగా జూ రాలకు చేరుకొని డ్యాం లోని నీటి నిల్వలను పరిశీలించింది.
ఈ ప్రాజెక్టు పరిధిలో ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించిందంటూ ప్రచారం ఉండగా.. నేతల సందర్శన ప్రాధాన్యత సంతరించుకున్నది. డ్యాంలో ఉన్న నీటి నిల్వలు, రైతుల పంటలకు ఎంతమేర సరిపడతాయన్న అంచనాలను అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది అత్యధికంగా వర్షపాతం నమోదు చేసుకున్న క్రమంలో జూరాల ద్వారా రెండో పంట కు నమ్మకంగా నీరిందిస్తామని ప్రభుత్వం ప్రకటించకపోవడం కూడా కొందరు రైతులు బీఆర్ఎస్ సభ్యుల బృందం దృష్టి కి తెచ్చారు.
జూరాల ప్రధాన ఎడమ కాల్వతో పాటు ప్యార్లాల్ కెనాల్‌ను సైతం నేతలు పరిశీలించారు. ప్రాజెక్టుల ను సందర్శించిన వారిలో ఉమ్మడి పాలమూరులోని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, బీరం హర్షవర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.