మెహిదీపట్నం, జనవరి 17: తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గోల్కొండ గోల్ఫ్ కోర్సు వద్ద నిర్వహిస్తున్న ఎయిర్ బెలూన్ షోలో తృటిలో ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం ఎయిర్ బెలూన్ ఇబ్రహీంబాగ్ సమీపంలో సాంకేతిక లోపంతో ఆగిపోయింది. ఎయిర్ బెలూన్ నడుపుతున్న వ్యక్తి చాకచక్యంతో ఇబ్రహీంబాగ్ వద్ద చెరువు పక్క మైదానంలో దింపేశాడు. అక్కడ బురద ఉండటంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. స్థానికుల సహకారంతో సురక్షితంగా బయట పడ్డారు.