చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే ఘోర పరాజయం నేపథ్యంలో ఆ పార్టీలో కొత్తగా అసమ్మతి సంకేతాలు వెలువడ్డాయి. పార్టీ అధినేత ఎడప్పాడి కే పళనిస్వామి రాజీనామా చేయాలని కొందరు ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీలోని కొన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ రాజీనామా చేయడానికి ఈపీఎస్ సుముఖంగా లేరని ఆ వర్గాలు తెలిపాయి.
పార్టీ ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం సీనియర్ పార్టీ నాయకుడు సీవీ షణ్ముగంతో విధేయంగా ఉన్న ఎమ్మెల్యేలు పలువురు మాజీ మంత్రులతో కలసి వరుసగా నాలుగు ఎన్నికల ఓటముల తర్వాత ఆయన నాయకత్వాన్ని ఇకపై అంగీకరించడానికి సిద్ధంగా లేమని ఈపీఎస్కు తెలియచేశారు. ఏప్రిల్ 23న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే 234 స్థానాలకు గాను కేవలం 47 స్థానాలను గెలుచుకుంది.