రేపు పాలిసెట్.. 1.06 లక్షల మంది దరఖాస్తు
మూడేండ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పాలిసెట్-2026 పరీక్షను బుధవారం నిర్వహించనున్నామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
- 293 సెంటర్ల ఏర్పాటు : సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : మూడేండ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పాలిసెట్-2026 పరీక్షను బుధవారం నిర్వహించనున్నామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు వెల్లడించారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1:30గంటల వరకు పరీక్షను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది 1,06,439 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 293 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, విద్యార్థులను గంట ముందుగా సెంటర్లలోకి అనుమతిస్తామని తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని స్పష్టంచేశారు.
విద్యార్థులకు సూచనలు
- విద్యార్థులకు ఇచ్చిన ఓఎమ్మార్ షీట్‌పై రెండు వైపులా సంతకం చేయాల్సి ఉంటుంది.
- విద్యార్థులు హెచ్‌బీ బ్లాక్ పెన్సిల్, ఎరేజర్, బ్లూ లేదా బ్లాక్ కలర్ పెన్ వెంట తెచ్చుకోవాలి.
- హాల్‌టికెట్‌పై ఫొటో ముద్రితంకాని వారు వెంట పాస్‌పోర్టు సైజు ఫొటో, ఆధార్‌కార్డు వెంట తెచ్చుకోవాలి.
- ఎస్బీ టెట్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకొని, ఎగ్జామ్ సెంటల్ లొకేటర్ ఆప్షన్ ద్వారా సెంటర్లకు చేరుకోవచ్చు.

Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
Parveta Utsavam | తిరుమలలో ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం
Scene | ‘సీన్’ ప్రమోషన్స్ టైం.. సూర్య టీం ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసిందో తెలుసా..?
Shashi Tharoor | ‘నన్నడిగితే ఎలా.. నేనేం ట్రావెల్ ఏజంట్‌ను కాదు’.. రాహుల్‌గాంధీ ఫారిన్ టూర్‌పై శశిథరూర్..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!

