భూదాన్‌పోచంపల్లి, మే 11 : ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఈనెల 17 నుంచి 21 వరకు కేన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా నిర్వహించనున్న ఫ్యాషన్ షోలో తెలంగాణ ఇకత్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్ పోచంపల్లి ఇకత్ వస్త్రాలు ధరించి క్యాట్ వాక్ చేయనున్నారు.
ఫ్యాషన్ షోకు అవసరమైన ఇకత్ వస్త్రాలను పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ సీఈవో తడక రమేశ్ రష్మీ ఠాకూర్‌కు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం వీవర్ సర్వీస్ సెంటర్ ద్వారా తమకు ఇకత్ వస్త్రాలును అందించేందుకు అవకాశం కల్పించిందని, రూ.లక్షల విలువైన ఇకత్ వస్త్రాలను ఎంపిక చేసి అందజేశామన్నారు. చేనేత కళాకారుడిగా ర్యాంప్ వాక్‌లో పాల్గొనే అవకాశం కల్పించారన్నారు.