న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో శనివారం నలుగురు వ్యక్తులు ఇద్దరు ఈశాన్య రాష్ట్ర మహిళలను వేధించారు. వారి దుస్తులను చించి, జాత్యహంకార దూషణలు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు మహిళలను వేధించారు. ఆ తర్వాత మరికొందరు జతచేరి జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. బాధితులు వారి తో ఘర్షణకు దిగగా, అడ్డుకొని.. ఎవరికైనా ఫిర్యా దు చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారు.
నిందితులు లైంగిక దాడి కూడా చేశారని ఒక బాధితురాలు ఆరోపించగా.. తాము వెళ్లిపోవడానికి ప్రయత్నించినప్పుడు కర్రతో నిందితులు దాడి చేశారని మరొకరు పేర్కొన్నారు. బాధితులను పోలీసులు వైద్య పరీక్షల కోసం ఎయిమ్స్‌కు పంపారు. నిందితులను సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.