హైదరాబాద్, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ): గ్రూప్-1 విషయంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలకు విరుద్ధంగా టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌కు వెళ్లి 3 లక్షల మంది అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మండిపడ్డారు. కోర్టుకు వెళ్లే హక్కు ఉన్నప్పటికీ.. నిరుద్యోగుల్లో నమ్మకం కల్పించడంలో విఫలమైందని బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.