హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగంలోని డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్స్ గ్రేడ్ -2 జనరల్ ర్యాంకింగ్ లిస్టు(జీఆర్ఎల్)ను టీజీపీఎస్సీ శనివారం విడుదల చేసింది. జీఆర్ఎల్తోపాటు ఫైనల్ కీని సైతం విడుదల చేసింది.
జూన్ 30, జూలై 4న డీఏవో ఉద్యోగాల భర్తీకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌ను నిర్వహించారు. జూలై 31న ప్రాథమిక కీని విడుదల చేయగా, తాజాగా శనివారం ఫైనల్‌కీతోపాటు జనరల్ ర్యాంకింగ్ లిస్టును వెబ్సైట్లో పొందుపరిచింది.
హైదరాబాద్, సెప్టెంబర్21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆయుష్ డిపార్ట్మెంట్ వివిధ జిల్లాల్లో పార్ట్ టైం బేసిస్ మీద యోగా ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. వివరాలు కోసం ayush. telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.