హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం మంగళవారం లోక్‌భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషన్ చేపడుతున్న నియామక ప్రక్రియలు, పరీక్షల నిర్వహణ తీరును గవర్నర్‌కు వివరించారు.
మెరిట్ ప్రాతిపదికన నియామకాలు జరుపాలని ఈ సందర్భంగా చైర్మన్‌కు గవర్నర్ సూచించారు. కమిషన్ బాధ్యతలకు లోక్‌భవన్ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.