ఒక్క గెటప్ కోసం 83 లుక్స్?
కొత్త దర్శకులతో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ప్రస్తుతం ఆయన ‘జైలర్ 2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
కొత్త దర్శకులతో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ప్రస్తుతం ఆయన ‘జైలర్ 2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆ తర్వాత కమల్‌హాసన్ నిర్మాణ సంస్థలో కమల్‌తో కలిసి మల్టీస్టారర్ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు తలైవా. దీనితోపాటు శివకార్తికేయన్ ‘డాన్’ఫేం శిబి చక్రవర్తి దర్శకత్వంలో కూడా రజనీకాంత్ ఓ సినిమా చేయనున్నారు.
ఈ రెండు సినిమాలూ ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్నాయి. అయితే.. దర్శకుడు సిబిచక్రవర్తి మాత్రం కాస్త స్పీడ్ మీదే ఉన్నాడు. ‘జైలర్ 2’ షూట్ పూర్తవ్వగానే.. తన సినిమాను పట్టాలెక్కించాలనే కృతనిశ్చయంతో ఉన్నారాయన. తాను చేయబోయే సినిమాలో రజనీకాంత్ గెటప్ చాలా కీలకం. అందుకే.. ఆ గెటప్ కోసం 83 లుక్స్‌ని డిజైన్ చేయించారట శిబిచక్రవర్తి. వాటిలో మూడు ఫైనల్ చేసి, ఆ మూడింటినీ రజనీకాంత్‌కు ప్రజెంట్ చేశారట.
వాటిలో ఒకదాన్ని రజనీ ఫైనల్ చేయాలి. ఒక స్టార్ కోసం ఇంత విస్తృత స్థాయిలో లుక్ ఎక్స్‌పెరిమెంటేషన్ జరగడం భారతీయ సినీ చరిత్రలోనే అరుదైన విషయంగా చెప్పుకుంటున్నారు. దీనిపై తలైవా అభిమానుల్లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 75ఏండ్ల రజనీపై ఇలాంటి ప్రయోగాలు కరెక్ట్ కాదంటూ కొందరు ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

