గద్దర్ అవార్డుల ఫంక్షన్‌కు కోట్లు కుమ్మరింత!.. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్
ప్రజాయుద్ధనౌక గద్దర్ పేరును వాడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 పేరిట కోట్లు కుమ్మరించడం ఏమిటని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.
- ఒకరాత్రి ముచ్చటకే 4.11 కోట్లా?
- దీనిపై శ్వేతపత్రం విడుదలచేయాలి
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ప్రజాయుద్ధనౌక గద్దర్ పేరును వాడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 పేరిట కోట్లు కుమ్మరించడం ఏమిటని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. గాయని శ్రేయా ఘోషల్‌కు రూ.1.65 కోట్లు, దేవిశ్రీ ప్రసాద్‌కు రూ.80 లక్షలు ఖర్చు చేయడం ఏమిటని మంగళవారం ఎక్స్ వేదికగా నిలదీశారు. నిధి అగర్వాల్‌కు రూ.20 లక్షలు, యాంకర్లు సుమ-ప్రదీప్‌కు రూ.13 లక్షలు ఇలా ఆర్టిస్టుల కోసమే రూ.4.11 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ఒకరాత్రి ఈవెంట్‌కు వ చ్చినవారి ప్రయాణాలు, బసకు రూ.60 ల క్షల ప్రజాధనం వెచ్చించారని విమర్శించారు.
ఖర్చుల వెనుక మాయాజాలం!
గద్దర్ఫిల్మ్ అవార్డ్స్-2025 ఖర్చుల వెనుక పెద్ద మాయాజాలమే జరిగిందని శ్రవణ్ ఆరోపించారు. టెండర్ కాస్ట్ కాలమ్‌లో రూ.2.13 కోట్లు ఉంటే, తుది బిల్లు రూ.4.11 కోట్లు వేశారని, అంటే రూ.2 కోట్ల అదనపు ఖర్చు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు, రైతు భరోసాకు పైసల్లేవని ఏడ్చే ప్రభుత్వం.. ఒకరాత్రి వేడుకకు ఇన్ని కోట్లు ఎలా వెచ్చిస్తుంది? అని నిలదీశారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

