హనుమకొండ, జూన్ 16 : హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన స్నేహ శబరీష్‌ను జిల్లా టీజీవోలు మర్యాద పూర్వకంగా కలిసారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లోని చాంబర్లో రాష్ట్ర ఉపాద్యక్షుడు ఎన్నమనేని జగన్మోహన్రావు ఆధ్వర్యంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పథకాలు అమలులో గెజిటెడ్ అధికారులదే కీలకపాత్ర అని, సంక్షేమ పథకాల అమలులో ఉద్యోగులు కలిసి జిల్లాను అగ్రభాగంలో నిలపాలని కలెక్టర్ కోరినట్లు టీజీఓలు తెలిపారు.
కలెక్టర్‌ను కలిసిన వారిలోటీజీవో హనుమకొండ జిల్లా కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమార్, కోశాధికారి రాజేష్ కుమార్, రాష్ర్ట కార్యదర్శులు కోలా రాజేష్ కుమార్, అస్నాల శ్రీనివాస్, డీసీవో సంజీవ రెడ్డి, కాజీపేట తహసీల్దార్ బావుసింగ్, జిల్లా నాయకులు మాధవరెడ్డి, శ్రీనివాస రావు, డాక్టర్ విక్రమ్, సంతోష్, వినోద్, డాక్టర్ వినయ్, వాసం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.