రామగిరి, ఫిబ్రవరి 6: రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ‘టీజీ ఐసెట్’- 2026 నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈ పర్యాయం సెట్ నిర్వహణ నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ)కు అప్పగించడంతో శుక్రవారం వర్సిటీలోని వీసీ చాంబర్లో ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్, ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ అల్వాల రవి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అధికారిక వెబ్ సైట్ icet.tgche.ac.inలో పూర్తి సమాచారం అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. అభ్యర్థులు షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు..
అన్ రిజర్వ్డ్ క్యాటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుం రూ.750, రిజర్వ్డ్ క్యాటగిరీ అభ్యర్థులు రూ.550 చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో ఐసెట్ కో కన్వీనర్లు మిర్యాల రమేశ్‌కుమార్, సురేశ్‌రెడ్డి, యూనివర్సిటీ ఎంబీఏ విభాగం ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు శ్రీలక్ష్మి, సరిత, లక్ష్మీప్రభ, ప్రవళిక, మారం వెంకటరమణారెడ్డి, సబీనా హెరాల్డ్, శ్వేత, పీహెచ్ డీ స్కాలర్ రమేశ్ నాయక్ పాల్గొన్నారు.