హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : టీచర్లకు టెట్ తప్పనిసరి అని కేంద్రం మరోసారి స్పష్టంచేసింది. టెట్ అర్హత సాధించేందుకు 2028 ఆగస్టు 31 వరకు గడువుందని పార్లమెంట్‌కు తెలిపింది. టీచర్లకు టెట్ తప్పనిసరి అని 2025 సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని.. 2027 ఆగస్టు 31 గడువుగా విధించిందని.. అయితే టెట్ రివ్యూ పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు ఈ గడువును 2028 ఆగస్టు 31 వరకు పొడిగించినట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లద్జోషి లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
టెట్ అర్హత సాధించని ఉపాధ్యాయుల కోసం ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించిందని, ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు.