Elon Musk | భారీ సంస్కరణలు అత్యవసరం.. హెచ్-1బీ వీసాలపై మాట మార్చిన మస్క్
హెచ్-1బీ వీసా విధానం విఫలమైందని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అభివర్ణించారు. ఇందులో భారీ సంస్కరణలు అవసరమని ఆయన స్పష్టం చేశారు.
- హెచ్-1బీ వీసా విధానం విఫలమైంది
Elon Musk | న్యూయార్క్, డిసెంబర్ 30: హెచ్-1బీ వీసా విధానం విఫలమైందని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అభివర్ణించారు. ఇందులో భారీ సంస్కరణలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలో విదేశీ నైపుణ్య కార్మికులు పనిచేసేందుకు అనుమతించే ఈ విధానాన్ని రక్షించేందుకు యుద్ధానికి సైతం సిద్ధమని ప్రకటించిన కొన్ని రోజులకే ఎలాన్ మస్క్ నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. వచ్చే జనవరిలో ఏర్పడనున్న ట్రంప్ ప్రభుత్వంలో భాగస్వాములు కాను న్న ఎలాన్ మస్క్, భారతీయ-అమెరికన్ టెక్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని ఇదివరకే బలపరిచారు. ఇమిగ్రేషన్ విషయంలో ట్రంప్ మద్దతుదారులతో కూడా వారు ఇటీవల ఘర్షణపడ్డారు. తాను యజమానిగా ఉన్న సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వచ్చిన ఒకపోస్టుపై ఎలాన్ మస్క్ ఆదివారం స్పందించారు.
దక్షిణాఫ్రికా నుంచి హెచ్-1బీ వీసాపై వలస వచ్చిన ఎలాన్ మస్క్.. హెచ్-1బీ వీసా విధానం విఫలమైందని, దీనికి భారీ సంస్కరణలు అవసరమని తాను భావిస్తున్నానని స్పష్టం చేశారు. ప్రపంచానికి చెందిన అత్యున్నత నైపుణ్యానికి అమెరికా గమ్యస్థానం కావాలని, అయితే హెచ్-1బీ వీసాతో ఆ పని జరగదని ఓ ఎక్స్ యూజర్ చేసిన వ్యాఖ్యలకు మస్క్ ఈ విధంగా స్పందించారు. విఫలమైన విధానాన్ని ఎలా సరిచేయవచ్చో కూడా మస్క్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. వీసా రావడానికి అవసరమైన కనిష్ఠ వేతనాన్ని గణనీయంగా పెంచాల్సి ఉంటుందని, దీని వల్ల దేశీయంగా లభించే ఉద్యోగుల కన్నా విదేశీ ఉద్యోగులను తీసుకోవడం చాలా ఖరీదుగా మారుతుందని మస్క్ పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

