పాలకవీడు, సెప్టెంబర్ 22 : సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం భవానిపురంలో గల దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాక్టరీలో బీహార్‌కు చెందిన కార్మికుడు ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో బీహార్ కార్మికులంతా సోమవారం ఉదయం ఫ్యాక్టరీ ఆవరణలో ధర్నా చేపట్టారు. స్థానిక పోలీసులు ఫ్యాక్టరీ ఆవరణకు రాగా కార్మికులు ఒక్కసారిగా తిరగబడ్డారు. ఎస్ఐ కోటేశ్, ఇద్దరు పోలీస్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Palakaveedu : దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్రిక్తత