తిమ్మాపూర్(శంకరపట్నం),ఆగస్టు11: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కొత్తగట్టులో గల శ్రీ మత్స్య గిరింద్ర స్వామి ఆలయ రాజగోపుర నిర్మాణ పనులను ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు పునఃప్రారంభించారు. గతంలో తెలంగాణ ప్రభుత్వ హయాంలో అప్పటి ఆలయ కమిటీ చైర్మన్ మల్హల్ రావు హయాంలో రూ.40 లక్షల నిధులతో పాటు రూ.పదిలక్షల విరాళాలతో పనులు చేపట్టారు.
అయితే పూర్తి స్థాయిలో కాకపోవడంతో తిరిగి రూ.10 లక్షలు విరాళాలు సేకరించి పనులను ప్రారంభించారు. రాజగోపుర నిర్మాణం అనంతరం ఆలయానికి శోభ వస్తుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ధర్మకర్తలు, నాయకులు పాల్గొన్నారు.