హైదరాబాద్ : తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌కు మణిహారమైన టీ-హబ్ రెండో దశ ప్రారంభానికి సిద్ధమైందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇంక్యుబేటర్ నూతన భవనం నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చిందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణమైన టీ-హబ్ నూతన భవనం 2 వేలకుపైగా స్టార్టప్‌లకు కేంద్రంగా నిలువనుందని పేర్కొన్నారు. త్వరలో అందుబాటులోకి వచ్చే ఈ భవనం దేశంలోనే అతిపెద్ద, ప్రపంచంలో రెండో పెద్ద ఇంక్యుబేటర్‌గా టీ-హబ్ నిలువనుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తద్వారా తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.