‘ఇదసలే కరెంటు పని. మీవల్ల కాదు. ఎత్తయిన విద్యుత్తు టవర్లు ఎక్కాలి. ఎండ, వాన, చలిలోనూ పనిచేయాలి. రోజూ ఉరుకులు పరుగులు తీయాలి. ప్రమాదకరమైన పరిస్థితుల్లో విధి నిర్వహణ ఉంటుంది. ఇలాంటి ఉద్యోగం మీకెందుకు?’ అన్న మాటలను పట్టించుకోకుండా ఆ మహిళలు పట్టుదలతో అనుకున్నది సాధించారు. ఆటంకాలను అధిగమించి ట్రాన్స్కో చరిత్రలో తొలిసారి జూనియర్ లైన్ ఉమెన్ ఉద్యోగం సాధించి తామెవరికీ తీసిపోమని నిరూపించారు. మరి వాళ్లెవరు..? వాళ్ల సక్సెస్ స్టోరీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.