తెలంగాణ ముఖం చిత్రం మారింది
నాగేటి సాళ్లల్ల్ల
పసిడి పంటలు పండుతున్నయ్
రైతన్నల ఒడిలో సిరులు కురుస్తున్నయ్…
కష్టాలు తొలిగి గట్టెక్కుతున్నయ్
‘రైతు బంధు’వు వచ్చి ఆదుకుంటున్నది!
హరిత హారం పేరుతో పల్లె ప్రగతి చాటుతున్నది
అభివృద్ధి పనులతో పట్టణ ప్రగతి కొనసాగుతున్నది…
ఆడవాళ్ల ఆత్మ గౌరవం మిషన్ భగీరథ
పల్లె ప్రజల ఆకాంక్ష మిషన్ కాకతీయ
బడుగు బలహీనుల ఆత్మగౌరవం
డబల్ బెడ్ రూమ్ ఇండ్లు…
ఆడబిడ్డల పెండ్లిల్ల కల్యాణలక్ష్మీ
వృద్ధులకు పింఛన్ల రూపంలో ఆసరా
తెలంగాణ అంతటా బతుకమ్మ సంబురాలు
ఎనిమిదేండ్లలో ఎనభైయేండ్ల ప్రగతి
ఇదీ నా తెలంగాణ.. పసిడికాంతుల తెలంగాణ..!
– ఎస్. జవేరియా
98499 31255