ఆత్మకూరు, నవంబర్23 : మండలంలోని పెద్దాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఆదివారం బీఆర్ఎస్లో చేరగా, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
వచ్చే స్థానిక ఎన్నికల్లో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో టీడీపీ మండల అధ్యక్షులు గోనే మధుకర్, నాయకులు అన్నం రాజు, అన్నం మొగిలి, నామాని యాదగిరి, మారేడుగొండ సత్యనారాయణ ఉన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బొ ల్లోజు కుమారస్వామి, మాజీ సర్పంచ్ సావురే రాజేశ్వర్రావు, గ్రామ పార్టీ అధ్యక్షులు రాయరాకుల రవీందర్, వేల్పుల గణేశ్ పాల్గొన్నారు.