e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ : మంత్రి కొప్పుల

మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ : మంత్రి కొప్పుల

మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ : మంత్రి కొప్పుల

హైదరాబాద్ : మతసామరస్యానికి తెలంగాణ ప్రతీక అని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. రంజాన్ పవిత్ర ఉపవాసాల మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా తెలంగాణలోని ముస్లిం సోదర,సోదరీమణులకు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.


ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ..దివ్య ఖురాన్ అవతరించిన ఈ పవిత్ర మాసంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజం భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తుందన్నారు. ఇస్లాం శాంతి, ప్రేమ, దయాగుణాలను ప్రబోధిస్తుందని మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలు, కులాలను సమానంగా చూస్తారన్నారు.


తెలంగాణలో మైనారిటీలతో పాటు ప్రజలంతా సుఖశాంతులతో జీవిస్తున్నారని, అందరి భద్రతకు, సంక్షేమానికి కేసీఆర్ ప్రాధాన్యతనిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. మైనారిటీల సంక్షేమం, అభ్యున్నతికి ఈ ఏడాది బడ్జెట్లో రూ.1606 కోట్లు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

204 గురుకులాల ద్వారా మైనారిటీలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. షాధీముబారక్ పథకాన్ని అమలు చేస్తుండడంతో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గాయని తెలిపారు.


ముస్లిం సమాజం ఆచరించే పవిత్ర ఉపవాస దీక్షలు భక్తిప్రపత్తులతో జరిపే ప్రార్థనలతో కరోనా మహమ్మారి పీడ విరుగడ కావాలని మంత్రి ఈశ్వర్ ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి..

దివ్యాంగులకు అండగా ఎమ్మెల్సీ కవిత

రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ : మంత్రి కొప్పుల

ట్రెండింగ్‌

Advertisement