సిటీబ్యూరో : పదో తరగతి ఫలితాల్లో హైదరాబాద్ అట్టర్‌ఫ్లాప్ అయింది. రాష్ట్రంలో ఎప్పటిలాగానే 89.23 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. 33వ స్థానానికి పడిపోయింది. 74,099 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 66,115 మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 91.4 ఉండగా బాలుర ఉత్తీర్ణత శాతం 86.95గా నమోదైంది. 4730 మంది బాలురు, 3,254 మంది బాలికలు ఫెయిల్ అయ్యారు. మూడేండ్ల నుంచి హైదరాబాద్ పది ఫలితాల్లో వెనకబడుతున్నది. ఈసారైనా ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని ఆశించిన విద్యాశాఖ అధికారులకు భంగపాటు తప్పలేదు.