హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డిసెంబర్లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్-2026’ గ్లోబల్ సమ్మిట్‌కు విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ర్టానికి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారం అత్యంత అవసరమని చెప్పారు.
రాష్ర్టాన్ని అభివృద్ధి, పెట్టుబడులు, పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, ఉపాధికల్పన, సంక్షేమం వంటి అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలుపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు.