విద్యుత్తు డిమాండ్ ఢమాల్
రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ ఒక్కసారిగా తగ్గింది. నిన్న మొన్నటి దాకా 18-20వేల మెగావాట్ల మధ్య ఉన్న డిమాండ్ అమాంతం పడిపోయింది. తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గడం విద్యుత్తు వినియోగంపై ప్రభావం చూపింది. నవంబర్ 1న 13,932 మెగావాట్ల విద్యుత్తు వినియోగమయ్యింది. ఇందులో 70 శాతం డిమాండ్ దక్షిణ డిస్కమ్లోనే నమోదయ్యింది. ఉత్తర డిస్కమ్‌లో డిమాండ్ కేవలం 30 శాతానికే పరిమితమయ్యింది.
- అమాంతం పడిపోయిన వినియోగం
- అక్టోబర్‌లో 20 వేల మెగావాట్లు
- నవంబర్ తొలిరోజు 13 వేలకే పరిమితం
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ ఒక్కసారిగా తగ్గింది. నిన్న మొన్నటి దాకా 18-20వేల మెగావాట్ల మధ్య ఉన్న డిమాండ్ అమాంతం పడిపోయింది. తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గడం విద్యుత్తు వినియోగంపై ప్రభావం చూపింది. నవంబర్ 1న 13,932 మెగావాట్ల విద్యుత్తు వినియోగమయ్యింది. ఇందులో 70 శాతం డిమాండ్ దక్షిణ డిస్కమ్లోనే నమోదయ్యింది. ఉత్తర డిస్కమ్‌లో డిమాండ్ కేవలం 30 శాతానికే పరిమితమయ్యింది. మొత్తంగా ఈ పది రోజుల్లోనే ఏడు వేల మెగావాట్ల డిమాండ్ తగ్గడం గమనార్హం. డిమాండ్ తగ్గడంతో విద్యుత్తు సంస్థల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
అక్టోబర్ మాసంలో రికార్డు స్థాయి పీక్ డిమాండ్ నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 15 వేల మెగావాట్లు దాటని పీక్ డిమాండ్ ఏకంగా 20 వేల మార్కును దాటింది. అక్టోబర్‌లో 20,018 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదయ్యింది. ఆ తర్వాత సగటున 18- 19వేల మెగావాట్ల డిమాండ్ ఉంటూ వస్తున్నది. కొన్ని రోజులైతే వరుసగా 19 వేలు రికార్డయ్యింది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. తరుచూ ప్లాంట్లు షట్‌డౌన్ అవుతున్నాయి. తాజాగా నాగార్జునసాగర్ హైడల్ ప్లాంట్‌లో 100 మెగావాట్ల యూనిట్ -2లో ఉత్పత్తి ఆగిపోయింది. ఈ తరుణంలో విద్యుత్తు వినియోగం, పీక్ డిమాండ్ తగ్గడం విద్యుత్తు సంస్థల అధికారులకు ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.
తేదీ : పీక్ డిమాండ్(మె.వా)
అక్టోబర్ 31 : 14,767
అక్టోబర్ 30 : 15,812
అక్టోబర్ 29 : 15,812
అక్టోబర్ 28 : 15,944
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

