సర్కార్ అసమర్థతతోనే గడ్డుకాలం
పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే రైతులకు ఈ దుస్థితి వచ్చేదా? అని మాజీ మంత్రి, మహబూబ్‌నగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ సీ లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం అమ్మాపూర్ శివారులో ఎండిపోయిన వరి పంటను మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. పంటలు ఎండిపోవడంతో రైతు దంపతులు నిర్మలమ్మ, బాలయ్య కన్నీరు పెట్టుకోగా వారిని ఓదార్చారు.
- ఎల్ నినో పేరుతో ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం
- నవాబ్‌పేట, మిడ్జిల్‌ను కరువు మండలాలుగా ప్రకటించాలి
- మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి
- ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కరువు: మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి
నవాబ్‌పేట, నవంబర్ 1 : పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే రైతులకు ఈ దుస్థితి వచ్చేదా? అని మాజీ మంత్రి, మహబూబ్‌నగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ సీ లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం అమ్మాపూర్ శివారులో ఎండిపోయిన వరి పంటను మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. పంటలు ఎండిపోవడంతో రైతు దంపతులు నిర్మలమ్మ, బాలయ్య కన్నీరు పెట్టుకోగా వారిని ఓదార్చారు. దాదాపుగా రూ.రెండు లక్షలు అప్పు తెచ్చి 8ఎకరాలు సాగు చేశామని, అందులో 4 ఎకరాలు ఎండిపోయిందని, మిగతా 4 ఎకరాలు కూడా ఎండుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగానే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేతగాని తనాన్ని ఎల్ నినోపై నెడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గతంలోనే 90 శాతం పూర్తి చేయడం జరిగిందని, మరో 10 శాతం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసి రిజర్వాయర్లు నింపితే ఎకరం పంట కూడా ఎండిపోయేది కాదని అన్నారు. పాలమూరు ప్రాజెక్టులో 70 టీఎంసీల నీరు నిల్వ చేసుకొని రైతుల పొలాలకు అందించేందుకు అవకాశం ఉన్నా.. ఈ చేతగాని ప్రభుత్వం పనులు చేపట్టకపోవడంతో రైతులకు నీరందక, కరెంట్ ఇవ్వకుండా పంటలను ఎండబెట్టారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతులకు రైతు భరోసా, రైతు బీమా కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. జిల్లాలోని నవాబ్‌పేట, మిడ్జిల్ మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా విస్మరించిందని అన్నారు. విద్యుత్తు సమస్యతోనే సగం పంటలు ఎండిపోయాయని ఆరోపించారు. రైతులకు వెంటనే పరిహారం అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

