న్యాయాధికారుల రిటైర్మెంట్ వయసు 62 ఏండ్లకు పెంపు
తెలంగాణ జిల్లాల్లోని అన్ని స్థాయిల్లో పనిచేసే న్యాయాధికారుల రిటైర్మెంట్ వయసును 61 ఏండ్ల నుంచి 62 ఏండ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసింది. ఈ పెంపును ఈ ఏడాది మార్చి 31 నుంచి వర్తింపజేస్తూ తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యుయేషన్) చట్టం-1984లోని సెక్షన్ 3(1ఏ)ను సవరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 213(1) కింద గవర్నర్ శివప్రతాప్ శుక్లా అక్టోబర్ 31న ఈ ఆర్డినెన్స్ జారీచేశారు.
- మార్చి 31 నుంచే వర్తింపు
- ఇప్పటికే రిటైరైన అర్హులుమళ్లీ సర్వీసులో చేరే అవకాశం
- ఆర్డినెన్స్ జారీచేసిన ప్రభుత్వం
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జిల్లాల్లోని అన్ని స్థాయిల్లో పనిచేసే న్యాయాధికారుల రిటైర్మెంట్ వయసును 61 ఏండ్ల నుంచి 62 ఏండ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసింది. ఈ పెంపును ఈ ఏడాది మార్చి 31 నుంచి వర్తింపజేస్తూ తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యుయేషన్) చట్టం-1984లోని సెక్షన్ 3(1ఏ)ను సవరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 213(1) కింద గవర్నర్ శివప్రతాప్ శుక్లా అక్టోబర్ 31న ఈ ఆర్డినెన్స్ జారీచేశారు. తెలంగాణ స్టేట్ హయ్యర్ జ్యుడీషియల్ సర్వీస్, తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్‌కు చెందిన న్యాయాధికారులకు ఈ సవరణ వర్తిస్తుంది.
న్యాయాధికారుల రిటైర్మెంట్ వయసును పెంచే అంశంపై సుప్రీంకోర్టు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులతోపాటు తెలంగాణ ఫుల్ హైకోర్టు చేసిన సిఫార్సుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. న్యాయాధికారుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచాలని ఈ ఏడాది ఆగస్టు 19న ఫుల్ హైకోర్టు సిఫారసు చేయగా.. ఈ ప్రయోజనాన్ని ఈ ఏడాది మార్చి 31 నుంచి వర్తింపజేయాలని జూలై 22న సుప్రీంకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్నది. మార్చి 31న లేదా ఆ తర్వాత రిటైరైన న్యాయాధికారులతోపాటు కోర్టు మధ్యంతర ఉపశమనం కారణంగా విధుల్లో కొనసాగిన న్యాయాధికారులకు కూడా ఈ ప్రయోజనం కల్పించాలని సూచించింది. ఇప్పటికే రిటైరైన న్యాయాధికారులను వారి సమ్మతితో తిరిగి విధుల్లోకి తీసుకొని, 62 ఏండ్ల వయసు వరకు వారు ఆ విధుల్లో కొనసాగేందుకు అవకాశం కల్పించాలని పేరొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

