Arrest | ‘ఒక లిప్‌కిస్ ఇయ్యవా ప్లీజ్’.. థాయ్-ఫ్రెంచ్ యూట్యూబర్‌కు ఉదయ్‌పూర్ వ్యక్తి వేధింపులు..!
Arrest | 'ఒక లిప్‌కిస్ ఇయ్యవా ప్లీజ్' అంటూ థాయ్-ఫ్రెంచ్ యూట్యూబర్ (Thai-French YouTuber) ను ఉదయ్‌పూర్ (Udaipur) కి చెందిన ఓ వ్యక్తి వేధింపులకు గురిచేశాడు. ఉదయ్‌పూర్‌లో ఆమె లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా అతడు లిప్‌కిస్ (Lip Kiss) ఇవ్వమంటూ వేధించాడు.
Arrest : ‘ఒక లిప్‌కిస్ ఇయ్యవా ప్లీజ్’ అంటూ థాయ్-ఫ్రెంచ్ యూట్యూబర్ (Thai-French YouTuber) ను ఉదయ్‌పూర్ (Udaipur) కి చెందిన ఓ వ్యక్తి వేధింపులకు గురిచేశాడు. ఉదయ్‌పూర్‌లో ఆమె లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా అతడు లిప్‌కిస్ (Lip Kiss) ఇవ్వమంటూ వేధించాడు. ఈ ఘటన సీసీ కెమెరా (CC Camera) లో రికార్డయ్యింది. ఆ వీడియో వైరల్ కావడంతో ఉదయ్‌పూర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
వేధింపులకు పాల్పడిన వ్యక్తి ఉదయ్‌పూర్‌కు చెందిన 23 ఏళ్ల అఫ్తాబ్ అలియాస్ గాబ్రూగా పోలీసులు గుర్తించారు. ఉదయ్‌పూర్‌లోని రద్దీగా ఉండే ప్రదేశంలో మహిళా యూట్యూబర్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా అఫ్తాబ్ ఆమె దగ్గరికి వెళ్లి ముద్దు కోసం వేధించాడు. యూట్యూబర్ ఉదయ్‌పూర్ గురించి వీక్షకులతో తన అభిప్రాయాలను పంచుకుంటుండగా.. నల్ల అంగీ, టోపీతో గాబ్రూ ఆమె దగ్గరికి వెళ్లాడు.
‘ఒక్క ముద్దు ఇవ్వండి. పెదవులపై ఒక్క ముద్దు ఇవ్వండి’ అని అతను మళ్లీమళ్లీ అడిగాడు. దాంతో ఆ యూట్యూబర్ అసౌకర్యానికి గురైంది. తనకు అతనిపట్ల ఎలాంటి ఆసక్తి లేదని చెబుతూ తిరస్కరించింది. అయినా అతను వెనక్కి తగ్గలేదు. ఆమె ఎన్నిసార్లు నిరాకరించినా అతను అదే అభ్యర్థనను కొనసాగించాడు. ఆమె అప్పుడు లైవ్‌లో ఉండటంతో జరిగినదంతా కెమెరాలో రికార్డయింది. ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దాంతో ఉదయ్‌పూర్ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు ఆ ప్రాంతంతోపాటు చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. చివరికి నిందితుడిని అరెస్ట్ చేశారు. భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 296 కింద అతనిపై కేసు నమోదు చేశారు.
అయితే అరెస్ట్ అనంతరం అఫ్తాబ్ తాను చేసిన పనికి క్షమాపణ కోరాడు. మహిళలను గౌరవించాలని కోరాడు. ఈ మేరకు ఓ వీడియో పోస్టు చేశాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ‘ఒక లిప్‌కిస్ ఇయ్యవా ప్లీజ్’.. థాయ్-ఫ్రెంచ్ యూట్యూబర్‌కు ఉదయ్‌పూర్ వ్యక్తి వేధింపులు..!
బీఆర్ఎస్ సర్పంచులపై ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చిందులు
MP Avinash Reddy | సర్పంచ్ ఎన్నికలైనా ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి : వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి డిమాండ్
Weight Increase | పండుగల అనంతరం బరువు పెరుగుదలతో ఆందోళన వద్దు.. ఇలా చేయండి చాలు..
MP Porika Balram Naik | మీకు భర్తలు లేకున్నా సరే.. కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలు : కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

