MP Avinash Reddy | సర్పంచ్ ఎన్నికలైనా ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి : వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి డిమాండ్
MP Avinash Reddy | మున్సిపల్, పరిషత్ ఎన్నికల మాదిరి కాకుండా పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
అమరావతి : మున్సిపల్, పరిషత్ ఎన్నికల మాదిరి కాకుండా పంచాయతీ ( Sarpanch elections) ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి ( MP Avinash Reddy ) ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. కడప జిల్లా వేంపల్లిలో వైసీపీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు.
సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై పార్టీ నేతలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎస్ఈసీ, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యాలు, రిగ్గింగ్‌కు పాల్పడిందని మండిపడ్డారు. సర్పంచ్ ఎన్నికల వేళ సర్పంచ్ అభ్యర్థి షబ్బీర్, రైస్ మిల్లుపై అక్రమ దాడులు చేసి సీజ్ చేశారని ఆరోపించారు. వేంపల్లి అభివృద్ధి, శాంతి భద్రతల కోసం ప్రజలు ఓటుతో సమాధానం చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
పులివెందులలో సగం పోలింగ్ బూత్‌లను టీడీపీ స్వాధీనం చేసుకొని దౌర్జన్యాలకు పాల్పడిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వేంపల్లిలో అభివృద్ధి, శాంతిభద్రతలు క్షీణించాయని, దాడులు, దౌర్జన్యాలను కూటమి నాయకులు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను కచ్ఛితంగా పోటీలో నిలబెట్టాలని సూచించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Avinash Reddy | సర్పంచ్ ఎన్నికలైనా ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి : వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి డిమాండ్
Weight Increase | పండుగల అనంతరం బరువు పెరుగుదలతో ఆందోళన వద్దు.. ఇలా చేయండి చాలు..
MP Porika Balram Naik | మీకు భర్తలు లేకున్నా సరే.. కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలు : కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్
BRS | ముధోల్‌లో బీఆర్ఎస్లో భారీగా చేరికలు.. బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ
Avengers: Doomsday | గంటకు వేలల్లో టికెట్ల విక్రయం.. రికార్డులు బద్దలు కొడుతున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

