BRS | ముధోల్‌లో బీఆర్ఎస్లో భారీగా చేరికలు.. బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ
ముధోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ బలం చేకూరింది. వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు.
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ బలం చేకూరింది. వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో, పార్టీ సీనియర్ నాయకురాలు రమాదేవి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా కేటీఆర్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు.
ముధోల్ నియోజకవర్గంలోని తాండూర్, కుభీర్ మండలాలకు చెందిన 11 మంది సర్పంచులు, నలుగురు ఉపసర్పంచులు, ఇద్దరు మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, పలువురు ముఖ్య నాయకులు బీఆర్ఎస్లో చేరారు. సర్పంచుల్లో ఎనిమిది మంది బీజేపీ నుంచి, ఒకరు కాంగ్రెస్ నుంచి, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన వారు ఉన్నారు. ఉపసర్పంచులంతా బీజేపీకి చెందిన వారే. మాజీ ప్రజాప్రతినిధుల్లో గతంలో కాంగ్రెస్‌లో పనిచేసిన నాయకులు కూడా బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ.. ముధోల్ నియోజకవర్గంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నప్పటికీ అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని విమర్శించారు. కనీసం ఒక్క అభివృద్ధి పనికి కూడా పునాది వేసిన దాఖలాలు లేవని, కేవలం ప్రారంభోత్సవాలకే పరిమితమయ్యారని అన్నారు. లోకేశ్వరం, తాండూర్ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర ఆందోళన, అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు.
బాసర ట్రిపుల్ ఐటీలో నీటి సరఫరా, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం వంటి కనీస సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, కేసీఆర్ హయాంలో సంస్థ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని రమాదేవి విమర్శించారు. ముధోల్ నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్ హయాంలోనే ప్రాధాన్యత లభించిందని, ప్రస్తుత కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని రమాదేవి అన్నారు. తాజా చేరికలతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ మరింత బలోపేతమైందని ఆమె పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | ముధోల్‌లో బీఆర్ఎస్లో భారీగా చేరికలు.. బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ
Avengers: Doomsday | గంటకు వేలల్లో టికెట్ల విక్రయం.. రికార్డులు బద్దలు కొడుతున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’
Harish Rao | ఇయ్యని పథకాలకు నీ పేరు పెట్టుకో రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
Marri Janardhan Reddy | కాంగ్రెస్ మూడేళ్ల సంబరాలు కాదు.. హామీల సమాధానం కావాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి డిమాండ్
సహజ కాన్పులపై గర్భిణులకు అవగాహన
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

