హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): కేరళ ఆతిథ్యం ఇచ్చిన సౌత్‌జోన్ షూటింగ్, హైదరాబాద్‌లో జరిగిన స్టేట్ లెవెల్ షూటింగ్ టోర్నీల్లో తెలంగాణ పోలీసులు సత్తా చాటారు. 6 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్యాలతో మొత్తం 15 పతకాలు సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం డీజీపీ సీవీ ఆనంద్ విజేతలను అభినందించారు. క్రీడల్లోనూ ప్రతిభ కనబరుస్తూ శాఖకు పేరు తీసుకురావడం అభినందనీయమని పేరొన్నారు. రాబోయే జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని డీజీపీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐజీ గజరావు భూపాల్ , స్పోర్ట్స్ డీఎస్పీ రామారావు పాల్గొన్నారు.