తే.గీ: పూడిపోయిన చెరువుల పూడ్కెదీసి
నీరు నిల్చుట కేర్పాటు నియతిజేసి
ఉచితమైన కరంటును వూతమిచ్చి
పంటలను పాదుకొల్పిన పరమగురుడు
తే.గీ: మనిషి అవసరమేదియొ మనసునెఱిగి
ఇంటి యింటికి నీరును యిచ్చివేసి
స్త్రీల బాధలు బాపిన సరసుడనగ
మరుపు రానట్టి పనులతో మాన్యుడయ్యె
తే.గీ: రైతుబంధుతో యుత్పత్తి రాణకెక్కె
డబులు బెడ్రూములిచ్చియు రాష్ట్రమందు
మురికివాడల రూపును మాపివేసి
దళితబంధుతో దారిద్య్ర ధ్వంసమయ్యె
తే.గీ: పెళ్లికానుక ప్రసవకిట్ పేదలకును
వరము ఐనది జనముది వాంఛదీరె
విశ్వసాహిత్య సభలతొ విపులముగను
తెలుగు తేజము జెగమున తెప్పరిల్లె
తే.గీ: రాష్ట్ర సాధకుడాయన రమణము గను
చావు నోటిలో తలదూర్చి చేవతోడ
కేంద్ర ప్రభుతను వణికించె కేసీఆరు
జూన్ రెండున ప్రకటన జాతి గాంచె
తే.గీ: ప్రగతి బాటన తెలగాణ తెప్పరిల్ల
కూల్చజూచిరి యెందరొ క్రూరులయ్యి
వీరవర్యుడు కేసిఆర్ విరిచె వారిని
దేశ సగటుకు మించగ చేసినాడు.
– మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి
93913 23453