హైదరాబాద్, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ): ‘దేశాన్ని సాకుతున్న నాలుగైదు అతిపెద్ద రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి’ అని సీఎం కేసీఆర్ పదేపదే చెప్తుంటారు. కేంద్ర ప్రభుత్వ నివేదికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ఓ జాతీయ పత్రిక చేసిన విశ్లేషణలో సైతం ఆర్థిక శక్తులుగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణను ఒకటిగా తేల్చింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ర్టాలతో పోల్చితే దక్షిణాది రాష్ర్టాలు బలంగా ఉన్నాయని వెల్లడించింది. ఈ విశ్లేషణలో దేశాన్ని తూర్పు, పశ్చిమ, మధ్య (సెంట్రల్), దక్షిణ, ఉత్తర రీజియన్ల పేర్లతో ఐదు భాగాలుగా విభజించారు.
బలంగా దక్షిణాది
తూర్పు: ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మేఘాలయ, అసోం, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, మిజోరం.
పశ్చిమ: గుజరాత్, రాజస్థాన్, హర్యానా.
మధ్య: తెలంగాణ, మహారాష్ట్ర, గోవా.
ఉత్తర: లడఖ్, జమ్ముకశ్మీర్, పంజాబ్, బీహార్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్.
దక్షిణ: కేరళ, తమిళనాడు, కర్ణాటక.