కీసర : ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR ) తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ( Minister Mallareddy ) పేర్కొన్నారు. కీసర మండలం రాంపల్లిదాయరలోని నూతన పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో స్థానిక స్వపరిపాలన కోసం అత్యాధునీకంగా కొత్త భవనాలను నిర్మించామన్నారు.
ప్రభుత్వ హయాంలో అర్హులందరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి (Kalyana Laxmi ) , షాదీముబారక్, మిషన్ భగీరథ, రైతుబంధు ( Raitu Bandu ) , రైతుబీమా వంటి పథకాలు ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ హయంలో జరిగినంత అభివృద్ధి గతంలో ఏనాడు జరుగలేదని వివరించారు.
వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని మరోసారి గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, రాంపల్లిదాయర సర్పంచ్ గరుగుల అండాలుమల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.