హెయిర్‌సెలూన్లు, దోభీఘాట్లకూ ఉచిత విద్యుత్
సెలూన్లూ.. దోభీఘాట్లకు ఉచిత విద్యుత్ రాష్ట్రంలోని అన్ని క్షౌర వృత్తి శాలలకు (హెయిర్ సెలూన్లు), లాండ్రీ షాపులకు, దోభీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు ..

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని క్షౌర వృత్తి శాలలకు (హెయిర్ సెలూన్లు), లాండ్రీ షాపులకు, దోభీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలు, నాయీ బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వానికి ఈ విషయమై పలు విజ్ఞప్తులు చేశాయి. ఈ విజ్జప్తులను సీఎం కేసీఆర్ నిశితంగా పరిశీలించిన మీదట ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందుకోసం తక్షణం జీవో జారీ చేయాలని సీఎంవో కార్యదర్శి భూపాల్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఆదేశించారు.సీఎం ఆదేశాల మేరకు అధికారులు జీవోను విడుదల చేశారు.
హెయిర్ సెలూన్లు, దోభీఘాట్లకు ఈ నెల ఒకటో తేదీ నుంచి ఈ జీవో ప్రకారం ఉచిత విద్యుత్ సరఫరా అమల్లోకి రానున్నది. అత్యంత బలహీన వర్గాల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. అత్యంత బలహీన వర్గాల సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
దీంతో మారుమూల గ్రామ స్థాయినుంచి గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) వరకు గల అన్ని హెయిర్ సెలూన్లకు, లాండ్రీ షాపులకు, దోభీ ఘాట్లకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన కరెంట్ ఉచితంగా అందుబాటులోకి రానున్నదన్నారు.
తద్వారా, తర తరాలుగా కుల వృత్తిని ఆధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న రాష్ట్రంలోని లక్షల రజక, నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నదని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
సాంకేతికాభివృద్ది కారణంగా పలు రకాల యంత్రాలు వీరి కుల వృత్తుల నిర్వహణలో దోహద పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఉచిత విద్యుత్తు నిర్ణయం ద్వారా వృత్తి దారులకు శారీరక శ్రమ తగ్గి, ఆర్ధిక వెసులు బాటు కూడా కలగనున్నది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవి కూడా చదవండి..
హీరో సంచలనం.. ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై మెకానిక్‌లకు శిక్షణ
ముంబైలో ఇల్లు కొన్న డీమార్ట్ యజమాని.. ఇంటి ధర ఎంతంటే..?
డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతే ఈ అలారం మోగుతుంది.. సిద్ధం చేసిన మిలటరీ
అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
కరోనా ఎఫెక్ట్ : బీహార్‌లో వారంపాటు విద్యాసంస్థల మూసివేత
కరోనా ఎఫెక్ట్ : జమ్మూకశ్మీర్‌లో పాఠశాలల మూసివేత
పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు మరింత తగ్గుతాయి: ధర్మేంద్ర ప్రధాన్
పక్కా ప్లాన్ ప్రకారమే మెషిన్ గన్లు, దేశీ రాకెట్లతో నక్సల్స్ దాడి..!
విద్యా రుణాలకు ఈ బ్యాంకులు బెస్ట్!
మారుతి సుజుకికి షాక్: డీఆర్ఐ పన్ను ఎగవేత నోటీసులు
రిలయన్స్-ఫ్యూచర్ డీల్‌కు 6 నెలల గడువు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
Gold price | బంగారం మళ్లీ ఆల్‌టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

