హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : పెద్దపల్లి జిల్లా మంథనిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పా టుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. భవన నిర్మాణానికి రూ.20కోట్లు మంజూరు చేసింది. రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి వికా స్ రాజ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. న్యాక్ సెంటర్ కేటాయించడంపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హర్షం వ్యక్తంచేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. స్వల్ప, దీర్ఘకాలిక కోర్సుల ద్వారా శిక్షణార్థులకు స్వయం ఉపాధితోపాటు ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు దక్కనున్నట్టు వివరించారు.