మారనున్న క్యూర్ రూపురేఖలు
క్యూర్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో వీధి దీ పాల రూపురేఖలను పూర్తిగా మార్చేందుకు రూ.1,341.60 కోట్ల అంచనా వ్యయంతో పదేళ్ల సమగ్ర నిర్వహణ (ఓఅండ్ఎం) ఒప్పందానికి జీహెచ్ఎంసీ టెండర్లు ఆహ్వానించింది. ప్రస్తుతం ఉన్న సాధారణ వీధి దీపాలన్నింటినీ తొలగించి, వాటి స్థానంలో అత్యంత నాణ్యమైన, ఎకువ ఓల్టేజీ కలిగిన సరికొత్త ఎల్ఈడీ లైట్లను అమర్చనున్నారు.
- రూ.1,341 కోట్లతో వీధి దీపాల ప్రాజెక్టు
- రెండేళ్లలో 7.61 లక్షల ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు
- పదేళ్ల పాటు సమగ్ర నిర్వహణకు టెండర్లు
- కంట్రోల్ రూమ్‌ల ద్వారా రియల్ టైమ్ మానిటరింగ్
సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): క్యూర్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో వీధి దీ పాల రూపురేఖలను పూర్తిగా మార్చేందుకు రూ.1,341.60 కోట్ల అంచనా వ్యయంతో పదేళ్ల సమగ్ర నిర్వహణ (ఓఅండ్ఎం) ఒప్పందానికి జీహెచ్ఎంసీ టెండర్లు ఆహ్వానించింది. ప్రస్తుతం ఉన్న సాధారణ వీధి దీపాలన్నింటినీ తొలగించి, వాటి స్థానంలో అత్యంత నాణ్యమైన, ఎకువ ఓల్టేజీ కలిగిన సరికొత్త ఎల్ఈడీ లైట్లను అమర్చనున్నారు. రాబోయే రెండేళ్ల వ్యవధిలో మొత్తం 7.61 లక్షల ఎల్ఈడీ లైట్లను కొత్తగా ఏర్పాటు చేయాలని కాలపరిమితిగా నిర్దేశించారు.
వీధి దీపాల స్విచ్చింగ్ వ్యవస్థను ఆధునీకరించేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 34,512 సీసీఎంఎస్ ప్యానెళ్లు, ఇతర స్విచ్చింగ్ పాయింట్ల స్థానంలో సరికొత్త స్మార్ట్ సీసీఎంఎస్ ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులను కేవలం ఆరు నెలల వ్యవధిలోనే పూర్తిచేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా, వీధి దీపాల వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రతి కార్పొరేషన్ పరిధిలో ఒక కేంద్రీకృత స్మార్ట్ డ్యాష్ బోర్డ్‌ను ఏర్పాటు చేస్తారు. దీంతో ధీపాలు వెలగకపోయినా, సాంకేతిక లోపాలు తలెత్తినా వెంటనే గుర్తించి సరిచేసే వీలుంటుంది.
98% కంటే తగ్గితే పెనాల్టీలే..
ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా ఉండేందుకు వీలుగా పాత నిర్వహణ నిబంధనలను ప్రభుత్వం సవరించింది. గతంలో ప్రతి 4వేల వీధి దీపాలకు ఒక మెయింటెనెన్స్ బ్యాచ్ ఉండగా.. ఇకపై ఆ పరిమితిని ప్రతి 2,500 వీధి దీపాలకు ఒక బ్యాచ్‌గా మార్చారు. లైట్ల మార్పిడి దశలో ప్రతి సరిల్కు ఒకటి చొప్పున మొత్తం 60 హైడ్రాలిక్ క్రేన్లను కాంట్రాక్టర్ రంగంలోకి దించాలి. నిర్వహణ కాలంలో కనీసం 30 క్రేన్లను నిరంతరం అందుబాటులో ఉంచాలి. సీసీఎంఎస్ ప్యానెళ్ల ప్రత్యేక పర్యవేక్షణ కోసం ప్రతి సరిల్కు ఇద్దరు టెక్నీషియన్లతో కూడిన ప్రత్యేక బృందాన్ని కేటాయించాలి. వీధి దీపాలు నిరంతరం వెలుగుతూ ఉండేలా సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్లో కఠిన నిబంధనలు చేర్చారు. ఏ సమయంలోనైనా వీధి దీపాల గ్లోయింగ్ శాతం 98 శాతం కంటే తగ్గితే కాంట్రాక్ట్ సంస్థపై భారీగా జరిమానాలు విధిస్తారు.
టెండర్లకు అర్హతలు ఇవే..
ఈ మెగా ప్రాజెక్టు దకించుకునేందుకు ఎల్ఈడీ వీధి దీపాలు, సీసీఎంఎస్ ప్రాజెక్టుల్లో అనుభవం ఉన్న అగ్రగామి సంస్థలు/ఓఈఎంల నుంచి బిడ్లను ఆహ్వానిస్తున్నారు. లీడ్ బిడ్డర్‌గా వ్యవహరించే సంస్థకు కనీసం రూ.400 కోట్ల వార్షిక టర్నోవర్ ఉండాలి. నిబంధనలకు లోబడి జాయింట్ వెంచర్లు, కన్సార్టియంలు కూడా ఈ టెండర్లలో పాల్గొనేందుకు అనుమతించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో క్యూర్ పరిధిలో చీకట్లు తొలగిపోవడమే కాకుండా, మున్సిపల్ కార్పొరేషన్లకు భారీగా విద్యుత్ బిల్లులు ఆదా కానున్నాయని టెండర్లో పేర్కొన్నారు. కాగా ఈ ప్రాజెక్టు ‘ముఖ్య’నేత అనుచరుడికి కట్టబెట్టేందుకే టెండర్ నిబంధనలను సవరించినట్లు ఆరోపణలు వస్తుండటం గమనార్హం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

