కరువుపై మాటలే.. చేతలు శూన్యం!
కరువును ఎదుర్కొనే విషయంలో ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతు న్నా.. చేతలు మాత్రం గడపదాటడం లేదు. కరువు ముప్పును కొవిడ్ మహమ్మారితో పోల్చుతున్న సీఎం రేవంత్రెడ్డి.. దానిని ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రకటించలేదు.
- రైతులే త్యాగాలు చేయాలా? పాలకులకు బాధ్యత లేదా?
- కొవిడ్ కాలం నాటి చర్యలకు సీఎం రేవంత్రెడ్డి వెనుకంజ
- కేసీఆర్ సరార్ తరహా ఆర్థిక భారం పంచుకునే ధైర్యం లేదా?
- 30 వేల కోట్ల కేంద్ర సాయానికి నిరీక్షణ? రైతులకేది భరోసా?
హైదరాబాద్, నవంబర్ 7(నమస్తే తెలంగాణ): కరువును ఎదుర్కొనే విషయంలో ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతు న్నా.. చేతలు మాత్రం గడపదాటడం లేదు. కరువు ముప్పును కొవిడ్ మహమ్మారితో పోల్చుతున్న సీఎం రేవంత్రెడ్డి.. దానిని ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రకటించలేదు. ప్రజలంతా సహకరించాలని మూడు వారాలు గా చెప్తున్న ఆయన.. బాధితులకు భరోసా కల్పించే ఒక్క నిర్ణయం కూడా ప్రకటించలేదు. 2020 మార్చిలో కరోనా మహమ్మారి కారణంగా కేంద్రం లాక్డౌన్ విధించడంతో రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయింది. అప్ప టి సీఎం కేసీఆర్ కేంద్రం సాయం కోసం ఎదురుచూడకుండా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అప్పటి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల చెల్లింపును 75% వాయిదా వేశారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు 60%, ప్ర భుత్వ ఉద్యోగులకు 50%, నాలుగో తరగతి, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందికి 10% చొప్పున మూడు నెలలపాటు తాత్కాలిక కోత విధించారు. ఇందులో పోలీసు, వైద్యారోగ్య, పారిశుద్ధ్య సిబ్బందికి మినహాయింపు ఇచ్చా రు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ విధానం అమలు చేశారు. జూన్ నుంచి పూర్తి వేతనాలు పునరుద్ధరించారు. ఈ నిర్ణయంతో సుమారు రూ.3,500 కోట్ల నిధులు సమకూరాయి. సంక్షోభ సమయం లో పాలకులు కూడా బాధ్యత పంచుకోవచ్చని నాటి ప్రభుత్వం నిరూపించింది.
నాటి స్ఫూర్తి.. నేడు ఎక్కడ?
కరువు ముప్పు పేరుతో సీఎం రేవంత్రెడ్డి రైతులను యాసంగి పంట వేయొద్దని చెప్తున్నా రు. నీరు, విద్యుత్తు ఆదా చేయాలని సూచిస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు, సాగు విరమించే రైతులకు కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులతో సాయం చేయాలని ప్రతిపాదిస్తున్నారు. రాష్ట్రం తనవంతు బాధ్యతపై స్పష్ట త ఇవ్వడంలేదు. హెల్ప్లైన్ల ఏర్పాటు ప్రతిపాదనలు చేస్తున్నా రైతులకు ఒరిగేదేమీ లేదు. పంట నష్టపోయిన వారికి ఎంత పరిహారం ఇస్తారు? యాసంగి సాగుచేయని రైతులకు ఎంత సాయం చేస్తారు? అర్హతలు ఏమి టి? నిధులు ఎకడి నుంచి తెస్తారు?
ఎప్పు డు చెల్లిస్తారు? అనే ప్రశ్నలకు సమాధానాలు లేవు. కేంద్రం నుంచి రూ.30వేల కోట్ల ప్యాకేజీ కోరడం కాదు.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే హామీ ఏమిటో చెప్పాలి. సాగు విరమించాలంటే రైతుల కుటుంబాలు ఎలా బతకాలో కూడా ఆలోచించాలి. కొవిడ్, ఎల్ నినో ఒకే తరహా సంక్షోభాలు కాకపోవచ్చు. కానీ, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని గట్టెక్కించేందుకు భాగస్వాములు కావాల్సిన బాధ్యత అన్నివర్గాలపై ఉన్నది. ముఖ్యంగా పాలకులు తమ వంతు త్యాగానికి సిద్ధంగా ఉన్నారా? రైతుల ఆదాయానికి హామీ ఇస్తారా? అనేది ప్రశ్నార్థకంగానే మిగిలింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

