బుల్లెట్ రైలుపై పాలకుల దోబూచులాట!
శంషాబాద్- చెన్నై బుల్లెట్ ట్రైన్ అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయి. భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అనుమతి మంజూరు చేయలేదని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. అంతే తప్ప జాతీయ రహదారి 65కు సమాంతరంగా సూర్యాపేట మీదుగా నిర్మిస్తామని స్పష్టం చేయలేదు.
శంషాబాద్- చెన్నై బుల్లెట్ ట్రైన్ అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయి. భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అనుమతి మంజూరు చేయలేదని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. అంతే తప్ప జాతీయ రహదారి 65కు సమాంతరంగా సూర్యాపేట మీదుగా నిర్మిస్తామని స్పష్టం చేయలేదు. రాష్ట్ర మంత్రివర్గం అలైన్మెంట్ మార్పునకు తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్టు వివిధ చానళ్లలో ప్రసారమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఈ విషయమై ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వడం లేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేంద్రం రెండు రాష్ర్టాల రాజధానులను కలుపుతూ స్పీడ్ రైలు కేటాయించాలి. రెండేండ్ల క్రితం శంషాబాద్-వైజాగ్ మార్గం మీదుగా సర్వే చేశారు. కానీ అది ముందుకు సాగలేదు. ఆంధ్ర లాబీయింగ్‌తోనే ప్రాజెక్టు ఆగినట్టు తెలుస్తున్నది.
పెట్టుబడిదారుల, పెత్తందారుల కుట్రల వల్లే తెలంగాణ దశాబ్దాలపాటు నష్టపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కూడా వాళ్లే ఆటంకాలు సృష్టించారు. శంషాబాద్-వైజాగ్ స్పీడ్ రైల్ విషయంలోనూ ఆంధ్రా లాబీ చక్రం తిప్పినట్టు తెలుస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేలాది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్‌కు ఇదే మార్గంలో ప్రయాణిస్తాయి. లాభాల పంట పండించే ఈ మార్గం మీదుగా రైల్వే కారిడార్ ఏర్పడితే, ఆంధ్ర ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యజమానులకు లాభాలు రాకపోగా, వారి వాహనాలు షెడ్డుకు పోవాల్సిందే. బుల్లెట్ ట్రైన్ ఆగమనాన్ని కూడా ఇవే శక్తులు ప్రభావితం చేస్తున్నాయని ఉద్యమకారులు, బుద్ధిజీవులు ఎలుగెత్తి చాటాల్సి ఉన్నది. జాతీయ రహదారి 65 వెంట ఉన్న సూర్యాపేట పట్టణం ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం 1965 ప్రకారం జనాభా, ఆదాయవనరుల ఆధారంగా మున్సిపాలిటీగా ఏర్పడింది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రైల్వే స్టేషన్ ఏర్పాటు జరిగి ఒకటిన్నర శతాబ్దం దాటినా సూర్యాపేటకు రైలు మార్గం లేదు. అనేకమార్లు వివిధ మార్గాల్లో సర్వేలు జరిగినా బడ్జెట్ కేటాయించలేదు, రైల్వే స్టేషన్ రాలేదు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు వాణిజ్య వ్యాపార కేంద్రం విజయవాడకు మధ్యలో ఉన్న అతిపెద్ద ప్రాంతం సూర్యాపేట. నాటి జాతీయ రహదారి-9పై పేరెన్నికగన్న ప్రాంతం సూర్యాపేట. కేంద్రం ప్రతిపాదించి ఆమోదించిన అలైన్‌మెంట్‌ను మారుస్తూ రాష్ట్ర క్యాబినెట్ బుల్లెట్ రైలు రాకుండా అడ్డుపడుతున్నది. తెలంగాణ అభివృద్ధిని మరోమారు అడ్డుకుని ఆంధ్ర రాష్ర్టానికి లాభం చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదనే అనుమానం కలుగుతున్నది.
హైదరాబాద్‌లో మొదటి రైల్వే స్టేషన్ 1874 అక్టోబర్ 9న ప్రారంభమైంది. మైసూరు పాలకుల వల్ల ఎదురైన సవాళ్లను ఎదుర్కోవడానికి, భాగ్యనగరాన్ని సైనిక స్థావరంగా మార్చడానికి, బొంబాయి, మద్రాస్ రైల్వే మార్గాలతో అనుసంధానించే లక్ష్యంతో స్టేషన్‌ను ప్రతిపాదించారు. 1856లో లార్డ్ డల్హౌసీ చేసిన ఈ ప్రతిపాదనకు నిజాం ప్రభుత్వం అంగీకరించింది.
1873లో ప్రజల వాటాలతో ఏర్పాటు చేసిన ట్రస్టులో నిజాం ప్రభుత్వం 5 లక్షల పౌండ్లను పెట్టుబడిగా పెట్టింది. బెంగాల్‌కు చెందిన రైల్వే ఇంజినీర్ మీడీ ఆధ్వర్యంలో వాడి- హైదరాబాద్ మధ్య రూ. 2 కోట్ల వ్యయంతో 110 మైళ్ల బ్రాడ్ గేజ్ మార్గం నిర్మాణం జరిగింది. 1874 నుంచి 1878 వరకు గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ సంస్థ ఈ మార్గాన్ని నిర్వహించింది. 1930 ఏప్రిల్ 1న నిజాం ప్రభుత్వం ఈ మార్గాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నది. వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి, రైల్వే మార్గాలను 1924 ఫిబ్రవరి 1న వరంగల్ వరకు, 1928 నవంబర్ 15న బలార్షా వరకు పొడిగించారు. 1966 అక్టోబర్ 2న దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటైంది. హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమై 78 ఏండ్లు గడుస్తున్నది. కానీ, హైదరాబాద్‌కు అత్యంత సమీపంగా ఉన్న జాతీయ రహదారి అప్పుడు 9. ఇప్పుడు 65కు రైలు మార్గం లేకపోవడం విచారకరం.
బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్చడం అంటే అభివృద్ధిలో జాతీయ రహదారి 65కు స్థానం లేకుండా చేయడమే. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత విధానాలు అభివృద్ధికి పూర్తిగా విరుద్ధమైనవి. వంద కిలోమీటర్ల దూరం తగ్గుతుందనే సాకు చూపి, అధిక జనాభా కలిగిన ప్రాంతాల/ పట్టణాల నుంచి ప్రజలను రవాణా సౌకర్యానికి దూరం చేయడమే. ప్రయాణికుల రద్దీ, ఆర్థిక నిర్వహణ, ప్రాంతాల అనుసంధానంపై రైలు మార్గం విజయం ఆధారపడి ఉంటుంది. అమరావతి – హైదరాబాద్‌ను కలిపే మార్గాన్ని ఉపేక్షించడం వెనుక ఆంధ్ర ప్రైవేట్ బస్ సర్వీసుల యజమానుల ఒత్తిడికి తలొగ్గడం సరికాదు. కొందరి లాభాపేక్ష కోసం నిబంధనలను తుంగలో తొక్కడం విడ్డూరం.
జాతీయ రహదారి 65పై హైదరాబాద్-సూర్యాపేట మధ్య రోజువారీ ప్రయాణికుల సంఖ్య ఆరు లక్షలు. అంటే ఈ దారి ఎప్పుడూ అత్యంత రద్దీగా ఉంటుంది. అందువల్ల యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. కాలుష్యం విపరీతంగా పెరుగుతున్నది. పండుగలు కాలంలో టోల్‌గేట్స్ దగ్గర గంటల కొద్దీ రద్దీ తప్పడం లేదు. ప్రయాణ సమయం వృధా అవుతున్నది. విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో, వ్యాపార, వాణిజ్య సంఘాలకు అత్యంత ప్రయోజనకరమైనది స్పీడ్ రైలు. శంషాబాద్- చెన్నై- సూర్యాపేట బుల్లెట్ ట్రైన్ రూట్ అలైన్‌మెంటును మార్చడం అంటే ప్రజల ఆకాంక్షలను బలి చేయడమే. వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటయ్యే రైలు కారిడార్లకు ప్రతిఫలం రావాలన్నా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతం నుంచే ఏర్పాటు జరగాల్సి ఉన్నది.
కేంద్రం అలైన్మెంట్ ప్రకటించిన శంషాబాద్-చెన్నై బుల్లెట్ రైలు మార్గాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తూ రెండు నెలలుగా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాలు జరుగుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా జేఏసీ ఆధ్వర్యంలో ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు. ప్రజాప్రతినిధులకు విజ్ఞాపన పత్రాల అందించారు. సూర్యాపేట పట్టణ బంద్ పాటించారు.
వివిధ కుల, వృత్తి, వ్యాపార, వాణిజ్య, విద్యార్థి, యువజన, కార్మిక, ఉపాధ్యాయ, మహిళా సంఘాలు 66 రోజులుగా రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికివారు ప్రజలతో దోబూచులాడటం సరికాదు. త్వరలోనే శాసనమండలి ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత జరగబోయే శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలపై కూడా ఈ ఉద్యమ ప్రభావం కచ్చితంగా ఉంటుంది.
(వ్యాసకర్త: రిటైర్డ్ హెడ్మాస్టర్)
-చెన్నోజు రమణాచారి ,99898 63039
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

