అడగండయా మీరు అడగండయా.. కాంగ్రెస్ లీడర్లను అడగండయా!
అడగండయా మీరు అడగండయా.. కాంగ్రెస్ లీడర్లను అడగండయా! ఓట్లకొచ్చినప్పుడు ఓట్లేసుకున్నపుడు.. సీట్లు గెలిచినప్పుడు సీట్లెక్కినపుడు.. అపుడేమొ చెప్పిన్రు.. ఇపుడేమొ చేస్తుండ్రు.. అడగండయా మీరు అడగండయా! కాంగ్రెస్ లీడర్లను అడగండయా! అని పాట పాడుతూ రైతన్నలు కాంగ్రెస్ సర్కార్ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. కరెంటు సమస్య, సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోవడంతో కడుపుమండిన అన్నదాతలు రోడ్డెక్కారు. పెద్ద ఎత్తున పాల్గొన్న రైతులు రాస్తారోకో నిర్వహించారు.
- కాంగ్రెస్ సర్కార్ తీరుపై ముక్తకంఠంతో రైతుల నిరసన పాటతో కడిగి పారేసిన వైనం
హైదరాబాద్, అక్టోబర్10 (నమస్తే తెలంగాణ): అడగండయా మీరు అడగండయా.. కాంగ్రెస్ లీడర్లను అడగండయా! ఓట్లకొచ్చినప్పుడు ఓట్లేసుకున్నపుడు.. సీట్లు గెలిచినప్పుడు సీట్లెక్కినపుడు.. అపుడేమొ చెప్పిన్రు.. ఇపుడేమొ చేస్తుండ్రు.. అడగండయా మీరు అడగండయా! కాంగ్రెస్ లీడర్లను అడగండయా! అని పాట పాడుతూ రైతన్నలు కాంగ్రెస్ సర్కార్ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. కరెంటు సమస్య, సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోవడంతో కడుపుమండిన అన్నదాతలు రోడ్డెక్కారు. పెద్ద ఎత్తున పాల్గొన్న రైతులు రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓ రైతు కాంగ్రెస్ తీరును ఎండగడుతూ పాటందుకున్నాడు. రైతుల్లో ఉత్తేజం నింపాడు. ఆయన పాటకు మిగతా రైతులంతా చప్పట్లతో కోరస్ పాడుతూ కదంతొక్కుతూ పదం కలిపారు. పాట ఆసాంతం కాంగ్రెస్ నాడు ఇచ్చిన హామీలు.. నేడు అమలు చేయని తీరును ఎండగడుతూ సాగింది. ఈ పాట కాంగ్రెస్ సర్కార్ దుర్నీతిని కండ్లకు కట్టినట్టుగా ఉన్నది. ఇది ఏ ఒక్కచోటనో కాకుండా రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై, సబ్స్టేషన్ల వద్ద, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఇలా పాటలు పాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

